
బీఆర్‌ఎస్‌కే ప్రజల మద్దతు
చేవెళ్ల: రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి అన్నారు. నగరంలోని ఆమె నివాసంలో సోమవారం మండలంలోని ముడిమ్యాలకు చెందిన కాంగ్రెస్‌పార్టీ నాయకులు, యువకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందిపోయారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయటంతో పూర్తిగా విఫలమయ్యారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పని రాష్ట్రంలో అయిపోయిందని మళ్లీ బీఆర్‌ఎస్ పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే వలసలు పెరుగుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేసి సత్తాను చాటుకుంటుందన్నారు. పార్టీలోకి వచ్చిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ క్రిష్ణారెడ్డి, నాయకులు ఆంజనేయులు, ప్రభాకర్, నారాయణ, రాజు, శశిపాల్, వెంకటేశ్, క్రిష్ణ, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోపక్క చేవెళ్లలోని పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్‌రెడ్డి సమక్షంలో రేగడిఘనాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి యువకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి
బీఆర్‌ఎస్‌లోకి పలువురి చేరిక