
హ్యాట్సాఫ్ లేడీ పోలీస్
మీర్‌పేట: భార్యాభర్తలిద్దరూ తమ రెండేళ్ల కొడుకును తీసుకుని పరీక్ష రాసేందుకు సెంటర్‌కు చేరుకున్నారు. చిన్నారిని ఎవరి వద్ద ఉంచాలో తెలియక తికమకపడుతున్న సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుళ్లు పరీక్ష పూర్తయ్యే వరకూ గంటపాటు చిన్నారిని ఆడించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మీర్‌పేటలోని టీకేఆర్ కళాశాలలో శనివారం తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష నిర్వహించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తమ చిన్నారిని తీసుకుని సెంటర్‌కు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు సమయం అవుతుండటంతో టెన్షన్ పడుతూ కనిపించారు. ఈ విషయమై ఆరా తీసిన మీర్‌పేట్ పీఎస్ హోంగార్డు కళ్యాణి, కానిస్టేబుళ్లు దుర్గ, కవిత చిన్నారిని తాము చూసుకుంటామని, పరీక్ష బాగా రాసి రావాలని సూచించడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు (పరీక్ష పూర్తయ్యే వరకూ) చిన్నారిని లాలించారు. ఇది చూసిన పలువురు అభ్యర్థులు పోలీసుల మానవత్వాన్ని అభినందించారు.

హ్యాట్సాఫ్ లేడీ పోలీస్