
కల్వకుర్తికి ఎనిమిది సబ్‌స్టేషన్లు
ఆమనగల్లు: కల్వకుర్తి నియోజకవర్గానికి నూతనంగా ఎనిమిది సబ్‌స్టేషన్లు, 300 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలోని మానసాగర్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాడైన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవాటి ఏర్పాటుకు ప్రభుత్వం రూ.2.3 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు.
26న డిప్యూటీ సీఎం రాక
తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఈ నెల 26న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రానున్నారని చెప్పారు. అనంతరం ఖానాపూర్‌లో బహిరంగసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసి సభ విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీసింగ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, ఆమనగల్లు ఏఎంసీ చైర్‌పర్సన్ గీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, చెంచు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండ్లి రాములు, మాజీ ఎంపీపీ విజయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, మండల అధ్యక్షుడు జగన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మానయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి