
289 మంది పోకిరీలకు కౌన్సెలింగ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో యువతులు, మహిళల్ని వేధిస్తూ ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్య షీ–టీమ్స్‌కు చిక్కిన 289 మంది పోకిరీలకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్‌లో స్వచ్ఛంద సంస్థలతో కలిసి డీసీపీ డాక్టర్ ఎన్‌జేపీ లావణ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు హాజరైన వారిలో 271 మంది మేజర్లు, 18 మంది మైనర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా వేధింపులపై 100కు కాల్ చేసి లేదా 9490616555కు వాట్సాప్ ద్వారా సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.