
సొంతింటి కల సాకారమే లక్ష్యం
యాచారం: నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. అర్హులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానన్నారు. యాచారం మండల కేంద్రం రైతు వేదికలో శుక్రవారం 441 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలే కీలకమని, అందరూ లబ్ధిపొందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి, నియోజకవర్గానికి అదనంగా మొదటి దఫాలో 20 వేల ఇళ్లు వచ్చేలా చూస్తానని తెలిపారు. ఇళ్ల కేటాయింపులో రాజకీయ ప్రభావం ఉండరాదని, కులమత వివక్ష ఉండదని స్పష్టంచేశారు. మంజూరు పత్రాలు అందుకున్న వారు..వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించుకుని, దసరా రోజున గృహప్రవేశం చేసుకోవాలని సూచించారు. నింబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టాలని స్పష్టంచేశారు.
పద్ధతి మార్చుకోండి
పంచాయతీ కార్యదర్శులు కొందరు ఇంకా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నట్లే భావిస్తున్నారని, ఇందిరమ్మ కమిటీలను లెక్కచేయడం లేదని ఫిర్యాదులు అందాయని తెలిపారు. అది మంచిది కాదని, వ్యవహార శైలి మార్చుకోవాలని ఆదేశించారు. మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ వ్యక్తిగతంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఇన్‌చార్జి ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్ అయ్యప్ప, మండల పంచాయతీ అధికారి శ్రీలత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మస్కు నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన
ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి 10వ వార్డులో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు పలువురు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీధర్‌నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, సురేశ్‌నాయక్, రవినాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, మల్లేశ్, బాలు, మురళీ, లక్ష్మీరెడ్డి, దావిద్, మాజీ సర్పంచ్ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తా
లబ్ధిదారులు దసరాకుగృహప్రవేశం చేయాలి
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
441 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత
బీసీలకు రూ.5 లక్షలు, ఎస్సీలకు రూ.6 లక్షలు
కడ్తాల్: పేద ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాటగీత, వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు, బాలాజీనగర్ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలు అందజేశారు. ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వం అర్హులందరికీఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తుందన్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉండి, ఇల్లులేని నిరుపేద బీసీలకు రూ.5లక్షలు, ఎస్సీలకు రూ.6 లక్షలతో ఇంటి నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, సింగిల్‌విండో డైరెక్టర్ వెంకటేశ్ సేవాదళ్ అధ్యక్షుడు లక్ష్మయ్య, నాయకులు రాజేశ్, షాబుద్దీన్, మల్లేశ్‌గౌడ్, ముత్తికృష్ణ, జహంగీర్‌అలీ, జహంగీర్‌బాబా, రవి, ఇమ్రాన్‌బాబా, రాంచందర్, శ్రీను, భిక్షపతి, మల్లయ్య, ఎంపీఓ లాలయ్య, కార్యదర్శి అల్లాజీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.

సొంతింటి కల సాకారమే లక్ష్యం

సొంతింటి కల సాకారమే లక్ష్యం