
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి
కడ్తాల్: ప్రకృతిని పరిరక్షిస్తూ, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ.. అధిక దిగుబడులు సాధించాలని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ అనిత, డాక్టర్ సుప్రజ, డాక్టర్ శిరీష, డాక్టర్ బాలునాయక్ అన్నారు. వ్యవసాయ శాఖ, విశ్వవిద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారంముద్వీన్, వాస్‌దేవ్ పూర్ గ్రామాల్లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. రసాయన ఎరువులు వాడటం వలన భూమిఫలదాయకత తగ్గిపోతుందని, భూములు నిస్సారమై బీడు భూములుగా మారే ప్రమాదముందని తెలిపారు. అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు వర్మి కంపోస్ట్, పచ్చిరొట్ట ఎరువులు వాడటం ఉత్తమమని, జీలుగ, జనుము కలియదున్నడం ద్వారా భూసార పరిరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. నీటీ ఎద్దడి పెరుగుతుండటంతో బిందు, తుంపర సేద్యంపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఎరువులు, విత్తనాల కొనుగోలు అనంతరం రసీదులు తీసుకోవాలని, పంట చేతికి వచ్చే వరకు వాటిని భద్రపర్చుకోవాలన్నారు. తద్వారా ఆపత్కాలంలో సరైన నష్ట పరిహారం పొందవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా సుస్థిర వ్యవసాయ పద్ధతులు, సాగులోని మెలకువలు, నీటి యాజమాన్యం, భూసారం పెంపు, రసాయన ఎరువుల వాడకం, సాగు ఖర్చులు తగ్గించడం, పంట మార్పిడి, పర్యావరణ రక్షణ తదితర ఆంశాలపై సమగ్రంగా వివరించారు. వెటర్నరీ వైద్యశాలలో లభిస్తున్న పలు స్కీంల గురించి తెలిపారు. కార్యక్రమంలో ఏఓ శ్రీలత, ఏఈఓలు అభినవ్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కశ్యఫ్, అనూష, వర్షిత్ ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
పచ్చిరొట్ట సాగుతో భూసారం మెరుగు
బిందు, తుంపర సేద్యంౖపైరెతులు దృష్టి సారించాలి
ప్రొఫెసర్ జయశంకర్‌విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు
పంటమార్పిడితో ప్రయోజనం
ఆమనగల్లు: నీటి ఎద్దడి నేపథ్యంలో బిందు, తుంపర సేద్యం ద్వారా నీటిని ఆదా చేయవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ సుచరితాదేవి, డాక్టర్ నిర్మల, స్వప్నశ్రీ, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌గౌడ్‌లు అన్నారు. ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామంలో విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. రసాయన ఎరువుల కారణంగా భూ సారం తగ్గిపోతుందన్నారు. జీవామృతం, వర్మి కంపోస్ట్, నీమ్ కేక్ వాడటం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని సూచించారు. అంతరపంటలు, పంటమార్పిడి పద్ధతులతో మట్టి ఆరోగ్యం మెరుగవుతుందని, ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ కేదార్, పలువురు రైతులు పాల్గొన్నారు.

ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి