
మాజీ ఉప సర్పంచ్ మృతి
కడ్తాల్: మండల పరిధి సాలార్‌పూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ కేతావత్ బీచ్యానాయక్ అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి శుక్రవారం.. బీచ్యానాయక్ పార్థీవదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సభవట్ బీచ్యానాయక్, నాయకులు శంకర్‌నాయక్ తదితరులు ఉన్నారు.
గర్భిణులకుమెడికల్ కిట్ల పంపిణీ
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం గట్టుఇప్పలపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సమకూర్చిన మెడికల్ కిట్లను శుక్రవారం గర్భిణులకు బీఆర్‌ఎస్ నాయకులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులుచంద్రశేఖర్‌రెడ్డి, అశోక్‌గౌడ్, రాజు, కృష్ణయ్య, శరత్‌చంద్ర, అనిల్, రాజు, మల్లేశ్‌గౌడ్, విజేందర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ కాని వారు దరఖాస్తు చేసుకోండి
మంచాల: మంచాల పీఏసీఎస్ బ్యాంకులో రుణమాఫీ వర్తించని రైతులు.. వారం రోజుల వ్యవధిలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఏసీఎస్‌లో చాలా మంది రైతుల వివరాలు తప్పుగా నమోదు కావడంతో మాఫీ కాలేదని పేర్కొన్నారు. లబ్ధిపొందని వారు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా నంబర్లు, పట్టా పాసుపుస్తకాల జిరాక్స్‌లు అందించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు
ఇన్‌చార్జి ఎంపీడీఓ జంగయ్యగౌడ్
ఇబ్రహీంపట్నం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పర్యవేక్షణకు మండలంలో తొమ్మిది మంది సూపర్ వైజర్లను నియమి ంచామని ఇబ్రహీంపట్నం మండల ఇన్‌చార్జి ఎంపీడీఓ యెల్లంకి జంగయ్యగౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అధికారి నవీన్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో వీరిని నియమించామన్నారు. మండలానికి మంజూరైన 437 ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
గ్రామాలవారీగా..
మండల వ్యవసాయ అధికారి విద్యాధరిని, ఏఈ(గ్రిడ్) రూప కప్పపహాడ్. మండల ఏఈ(పీఆర్) ఉస్మాన్ చర్లపటేల్‌గూడ, కర్ణంగూడ, పోచారం. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సరళ ఎలిమినేడు, ఉప్పరిగూడ. ఏఈఈ(ఆర్‌డబ్లూఎస్) రజిత తుర్కగూడ, తులేకలాన్. ఎంపీఓ రఘు పోల్కంపల్లి, నెర్రపల్లి. ఏఈఓ స్రుజన ముకునూర్, నెర్రపల్లి. ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పల్లవి దండుమైలారం. మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ వెంకటకృష్ణను రాయపోల్ గ్రామానికి నియమించామని వెల్లడించారు. ఈ అధికారులు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తూ, పరిశీలిస్తారని ఆయన పేర్కొన్నారు.
మృతురాలి నేత్రాలు దానం
ఆమనగల్లు: గుండెపోటుతో మృతిచెందిన వివాహిత మాధవి కళ్లను ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రికి దానం చేశారు. హైదరాబాద్‌లోని మారుతీనగర్‌కు చెందిన ఆమె గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు అర్థం మనోహర్, పీఆర్‌ఓ పాషా తదితరులు మాధవి భర్త అశోక్‌తో పాటు విదేశాల్లో ఉన్న ఆమె కుమారులను ఫోన్‌లో సంప్రదించారు. నేత్రదానం చేయాలని కోరడంతో కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించారు. దీంతో ఎల్‌వీప్రసాద్ ఆస్పత్రి వైద్యులు మాధవి కళ్లను సేకరించారు.
పాఠశాలకు
ప్రహరీ నిర్మించరూ!
నందిగామ: మండల పరిధిలోని మామిడిపల్లి అనుబంధ గ్రామం నసురుల్లాబాద్ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే సమయం ఆసన్నమైనందున అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పాఠశాలకు ప్రహరీ నిర్మించడంతో పాటు, మరుగుదొడ్లు మరమ్మతు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

మాజీ ఉప సర్పంచ్ మృతి

మాజీ ఉప సర్పంచ్ మృతి