
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం జూలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ, ద్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్చకులు శ్రీనివాసమూర్తి, నర్సింహమూర్తి ఆధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి, మహాగణాధిపతి, జయ విజయుల విగ్రహ ప్రతిష్ఠ, ద్వజస్తంభ ప్రతిష్ఠను నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిపించారు. ఉత్సవానికి జూలపల్లి గ్రామ ప్రజలు తలంబ్రాలతో తరలివచ్చారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, మార్కెట్ చైర్‌పర్సన్ గీత, పీసీబీ సభ్యుడు బాలాజీసింగ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో తలకొండపల్లి సింగిల్‌విండో చైర్మన్ కేశవరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రఘురాములు, నాయకులు జైపాల్‌రెడ్డి, రమేశ్‌యాదవ్, శ్రీను, యాదయ్య, రాజేందర్‌రెడ్డి, అజీజ్, రేణురెడ్డి,అంజయ్య, శ్రీశైలంగౌడ్, రాఘవేందర్‌గౌడ్, విష్ణు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.