
నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి
● కేశంపేట ఎంపీడీఓ కిష్టయ్య
● పలు గ్రామాల్లో ఇందిరమ్మఇళ్లకు భూమిపూజ
కేశంపేట: ఇందిరమ్మ ఇళ్లను నాణ్యంగా నిర్మించుకోవాలని ఎంపీడీఓ కిష్టయ్య లబ్ధిదారులకు సూచించారు. మండల పరిధిలోని నిర్దవెళ్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్‌గౌడ్, గ్రామస్తులతో కలిసి శుక్రవారం ఆయన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. కొండారెడ్డిపల్లిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, పాపిరెడ్డిగూడలో మాజీ సర్పంచ్ శివయ్య, బోధునంపల్లిలో మాజీ ఉప సర్పంచ్ నీల పాండు ఇందిరమ్మ నిర్మాణాలను ప్రారంభించారు. నిర్దవెళ్లిలో ఎంపీడీఓ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. విడతల వారీగా ఇళ్ల బిల్లులు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమవుతాయని స్పష్టంచేశారు. మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మొద్దని సూచించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో నాయకులు గుండే రాణి, అబ్బి సుందరయ్య, చెవెళ్ల నర్సింలు, తాండ్ర కృష్ణారెడ్డి, సత్యంగౌడ్, ప్రభాకర్‌జీ, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.