
సకాలంలో ధాన్యం కొంటున్నాం..
ఆమనగల్లు: రైతులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి గింజ సేకరిస్తామని, రైతులు దళారులకు ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. సన్నాలకు రూ.500 బోనస్ తీసుకోవాలని కోరారు. అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో చైర్‌పర్సన్ యాట గీత ఏర్పాటు చేసిన రైతులకు ఉచిత భోజన వసతికార్యక్రమాన్ని శ్రీశైలం ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సూపర్‌వైజర్ రాజ్యలక్ష్మి, సిబ్బంది వినోద్, కిరణ్, శరత్, కాంగ్రెస్ నాయకులు సుదర్శన్, గౌస్, విజేందర్ తదితరులు పాల్గొన్నారు.