పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి

Apr 1 2025 2:02 PM | Updated on Apr 1 2025 2:02 PM

పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి

పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి

షాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దామర్లపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు కుమార్‌, శివ, శివకుమార్‌, రాజు, అనిల్‌, పవన్‌, మల్లేశ్‌, మధావచారితో పాటు మరో 15 మంది బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలన్నారు. విభేదాలకు తావులేకుండా పార్టీ పటిష్టత, స్థానిక సంస్ధలన్నింటిలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. పార్టీ పటిష్టతకు పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుదన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులందరికీ రేషన్‌ కార్డులు వస్తాయని, అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కావలి చంద్రశేఖర్‌, ఎంపీటీసీ మాజీ సభ్యులు కుమ్మరి చెన్నయ్య, అశోక్‌, మాజీ సర్పంచ్‌లు లింగం, జనార్ధన్‌రెడ్డి, ఖాజామియా, శ్రీనివాస్‌గౌడ్‌, రవీందర్‌నాయక్‌, మహేందర్‌గౌడ్‌, నాయకులు రవీందర్‌యాదవ్‌, సుభాష్‌రెడ్డి, మాధవరెడ్డి, మల్లారెడ్డి, బురాన్‌ దస్తగిరి, సత్యం, శేఖర్‌, రాఘవేందర్‌, చేవెళ్ల స్వామి, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి

బీజీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement