రెక్కీ నిర్వహించి.. భారీగా దోచేసి | - | Sakshi
Sakshi News home page

రెక్కీ నిర్వహించి.. భారీగా దోచేసి

Mar 24 2025 7:05 AM | Updated on Mar 24 2025 7:04 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: రావిర్యాల ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసులో ఆదిబట్ల పోలీసులు పురోగతి సాధించారు. మార్చి ఒకటో తేదీ ఆదివారం అర్ధరాత్రి నాలుగు నిమిషాల్లో ఏటీఎం నుంచి రూ.29 లక్షలు అపహరించిన హర్యానా దుండగులు.. ఎట్టకేలకు రాజస్థాన్‌లో ఆదిబట్ల పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం.

ఫ్లైట్‌లో స్నేహితులను రప్పించి..

ఏటీఎం చోరీ కేసులో ప్రధాన నింధితుడు 2023లో నగరంలోని జేసీబీ షెడ్డులో పని చేసేవాడు. అనివార్య కారణాల వలన హైదరాబాద్‌ నుంచి హర్యానాకు వెళ్లిపోయాడు. అనంతరం గత నెల 21న నగరానికి కారులో వచ్చాడు. ఏదైనా పెద్ద దోపిడీ చేయాలని పక్కా స్కెచ్‌ వేసుకున్నారు. ఆటోలో భువనగిరి, బీబీనగర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడ అనుకూలంగా లేకపోవడంతో రావిర్యాల ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. మార్చి 1న హర్యానా నుంచి మరో నలుగురు స్నేహితులను ఫ్లైట్‌లో రప్పించుకున్నాడు. అదే రోజు అర్ధరాత్రి రావిర్యాల ఎస్‌బీఐ ఏటీఎంలోకి చొరబడినగదును అపహరించారు. అనంతరం మైలార్‌దేవరపల్లిలో మరో ఎస్‌బీఐ ఏటీఎం దోచే క్రమంలో.. వేరే వ్యక్తుల అలజడితో అక్కడి నుంచి ఆదే రాత్రి స్విఫ్ట్‌ కారులో పటాన్‌చెరువు మీదుగా హర్యానా, రాజస్థాన్‌కు పారిపోయారు.

నగరంలోనే షల్టర్‌..

దోపిడీకి ముందు ప్రధాన నిందితుడు హైదరాబాద్‌తో పాటు పటన్‌చెరువు ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు తెలిసింది. ఓ మజీద్‌లో పని చేసే వ్యక్తి షెల్టర్‌ ఇచ్చాడని, అతను బీహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. చోరీ చేసేందుకు అక్కడే గ్యాస్‌ కట్టర్లు, గ్లౌజ్‌లు, ఇనుపరాడ్లు, గ్యాస్‌ తదితర సామగ్రి కొనుగోలు చేసినట్లు తెలిసింది.

పహాడీ వీరికి అడ్డా..

కర్ణాటక, ఒడిస్సా, కడప, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఈ హర్యానా గ్యాంగే ఏటీఎంలను కొల్లగొట్టి నట్లు సమాచారం. రావిర్యాలలో అపహరించిన సొత్తుతో నేరుగా రాజస్థాన్‌లోని వారి అడ్డా అయిన మేవాడ్‌ ప్రాంతంలోని పహాడీ పోలిస్‌స్టేషన్‌ పరిధి లో తలదాచుకుంటారు. అక్కడే వాళ్ల రాజ్యం. స్థాని క ప్రజాప్రతినిధులు, పోలీసులు కలిసే సెటిల్‌మెంట్‌ చేసుకుంటారని తెలుస్తోంది. వాళ్లను పట్టుకోవడం కూడా చాలా కష్టమని, అక్కడి ప్రజాప్రతి నిధులను పట్టుకొని మధ్యవర్తిగా వ్యవహరించిన వారికి ముడుపులు ఇస్తే కాని.. సహకరించరన్నట్లు తెలుస్తోంది. 20 రోజులుగా ఆదిబట్ల పోలీసులు నాలుగు బృందాలుగా హర్యానా, రాజస్థాన్‌ ప్రాంతాల్లో ఆపరేషన్‌ చేసి నిందితులను గుర్తించినట్లు సమాచారం.

పోలీసుల అదుపులో దొంగలు

ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి నేతృత్వంలో.. పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు సమాచారం. రాజస్థాన్‌లో తలదాచుకున్న నిందితులు ఇద్ద రు, వారికి షెల్టర్‌ ఇచ్చిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారి నుంచి కొంత సొమ్ము రికవరీ చేసినట్లు, మరో నిందితుడిని ఇక్క డి పోలీసులకంటే ముందే వైజాగ్‌ పోలీసులు పట్టుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదీ ఏమైనా.. క్షణాల్లో ఏటీఎంలను కొల్లగొట్టే దొంగల ముఠాను తక్కువ తక్కువ కాలంలోనే పట్టుకొని పోలీసులు శభాష్‌ అనిపించుకున్నారు.

ఏటీఏం చోరీ కేసులో పురోగతి

రాజస్థాన్‌లో పట్టుబడిన హర్యానా గ్యాంగ్‌

ఆదిబట్ల పోలీసుల అదుపులోఐదుగురు నిందితులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement