ఆస్తిపన్ను అంతంతే | - | Sakshi
Sakshi News home page

ఆస్తిపన్ను అంతంతే

Mar 24 2025 7:02 AM | Updated on Mar 24 2025 7:01 AM

ఐదు ప్రత్యేక బృందాలు

మీర్‌పేట: మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఆస్తి పన్ను లక్ష్యం రూ.20.60 కోట్లుగా నిర్ణయించారు. మొత్తం 20,720 గృహాలు ఉండగా, కమర్షియల్‌/ రెసిడెన్షియల్‌ కలిపి దాదాపు 1,500 వరకు ఉన్నాయి. ఇప్పటివరకు 52 శాతం వరకు పన్నులు వసూలయ్యాయి. వంద శాతం వసూలు చేసేందుకు అధికారులు ఐదు ప్రత్యేక బృందాలను నియమించారు. గృహాలతో పాటు ట్రేడ్‌ లైసెన్స్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొండి బకాయిదారులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు రెడ్‌ నోటీసులు జారీ చేస్తున్నట్టు కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ తెలిపారు.

మున్సిపాలిటీల్లో వసూళ్లు సగమే..

ముగుస్తున్న తుది గడువు

వేగం పెంచిన అధికారులు

ప్రత్యేక బృందాలు, స్పెషల్‌ డ్రైవ్‌లు

లక్ష్యం దిశగా ఉరుకులుపరుగులు

మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా చాలా పురపాలికల్లో సగం కూడా వసూలు కాలేదు. మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. బస్తీల్లో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఇంటింటికీ తిరుగుతూ వసూళ్లలో వేగం పెంచారు. లక్ష్యం మేర వందశాతం పూర్తి చేస్తామని చెబుతున్నా ఉన్న కొద్ది రోజుల్లో వసూలు కావడం గగనమే.

వసూలు వేగవంతం

మొయినాబాద్‌ రూరల్‌: మొయినాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో ఈ నెలాఖరు వరకు రూ.2.13 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. వంద శాతం వసూలు చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్స్‌, హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు గ్రామాల్లో వసూలు వేగవంతం చేశారు. ఇప్పటి వరకు రూ.59 లక్షలు వసూలు చేశారు. మిగతా వాటి కోసం సెలవు దినాలు, ఆదివారాలు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

వందశాతం వసూలుకు కృషి

ఈ నెల 31లోపు పన్నులు చెల్లించాలి. ఏప్రిల్‌ 1 నుంచి పెనాల్టీతో చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలో ఇప్పటి వరకు రూ.59 లక్షలు వసూలయ్యాయి. వందశాతం వసూలు చేసేందుకు అందరం కృషి చేస్తున్నాం. – ఖాజా మొయిజుద్దీన్‌, కమిషనర్‌

ఆస్తిపన్ను అంతంతే 1
1/3

ఆస్తిపన్ను అంతంతే

ఆస్తిపన్ను అంతంతే 2
2/3

ఆస్తిపన్ను అంతంతే

ఆస్తిపన్ను అంతంతే 3
3/3

ఆస్తిపన్ను అంతంతే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement