ఆమనగల్లు: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతిని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం డీఎస్పీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందే విధంగా ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరు పుకొన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు రమేశ్, బాలరాం, హరి, మహేశ్, సురేశ్, యాదగిరి, శ్రీశైలం, జంగయ్య, నాగేశ్ పాల్గొన్నారు.
తుర్కయంజాల్‌లో..
తుర్కయంజాల్: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతిని ఇంజాపూర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు పట్నం రమేష్, ఉపాధ్యక్షుడు రాజులు మాట్లాడుతూ.. రాజకీయాలకు దూరంగ ఉన్న వర్గాలకు సైతం పదవులు దక్కేలా చేసిన ఘనత కాన్షీరాందేనని కొనియాడారు. రఘు, డాక్టర్ యడవల్లి శ్యామ్, రమణ, సైదులు, బాలకృష్ణ పాల్గొన్నారు.
ఘనంగా కాన్షీరాం జయంతి