మంచాల: అర్హులందరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందజేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధి ఆరుట్ల గ్రామంలో కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మండలంలో 755 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైందని, రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాతిరి ఎల్లేష్, చెరుకు నర్సింహ, కృష్ణ, బుగ్గరాములు, అంతటి రాజు, మార సురేష్, బాషయ్య, రమేష్, చంద్రయ్య, వస్పరి కుమార్, శ్రీనివాస్‌గౌడ్, అశ్రఫ్ తదితరులు పాల్గొన్నారు.