
కుంట్లూర్ కంటతడి
సైకిళ్ల అందజేత లయన్స్ క్లబ్ సౌజన్యంతో దెబ్బడగూడకు చెందిన పేద విద్యార్థినులకు ఈ–సైకిళ్లు అందజేశారు.
8లోu
హయత్‌నగర్: పెద్దఅంబర్‌పేట్ మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారని తెలుసుకున్న స్థానికులు పెద్దఎత్తున ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కుంట్లూరు– పసుమాముల రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సీఐలు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. పోస్టుమార్టం అనంతరం ఒకేసారి మూడు మృతదేహాలు కుంట్లూర్‌కు రావడంతో బంధువులు, స్థానికులు, మృతుల స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకేసారి ముగ్గురికి అంత్యక్రియలు జరపడంతో వందల సంఖ్యలో ప్రజలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
నేతల పరామర్శ..
యువకుల మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి గ్రామానికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీఆర్‌ఎస్ నాయకుడు క్యామ మల్లేశ్ తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పారు.
ముగ్గురు యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు
రోడ్డు ప్రమాద స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్
బాధితులను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యే రంగారెడ్డి