
నేరాల నియంత్రణకే కొత్త ఠాణాలు: సీవీ ఆనంద్
గోల్కొండ: నగరంలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం కొత్త ఠాణాలను ఏర్పాటు చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన టోలిచౌకీ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఇక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్ తొలి ప్రతిని ఫిర్యాదుదారుకు అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. నగరంలో నేరగాళ్ల పాలిట పోలీసులు సింహస్వప్నంలా మారారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూనే.. నేర నియంత్రణలోనూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. చోరీకి గురైన సెల్‌ఫోన్‌లను నగర పోలీసులు దేశంలోనే రికార్డు స్థాయిలో రికవరీ చేశారన్నారు. కార్యక్రమంలో సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ జి.చంద్రమోహన్, టోలిచౌకీ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రమేష్‌నాయక్ తదితరులున్నారు.