
ఉత్సవాలకు ఆహ్వానం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు.. రాష్ట్ర మత్స్య సహ కార సమాఖ్య చైర్మన్ మెట్టు సాయికుమార్‌కు ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. శని వారం నగరంలోని ఆయన నివాసంలో మాజీ సర్పంచ్ కాడమోని శ్రీశైలం, నాయకులు భిక్షపతి, రాజు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
వైభవంగా ఉత్సవాలు
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. మూడో రోజు శనివారం స్వామివారికి ఆలయ అర్చకులు రామాచార్యులు ఆధ్వర్యంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. కార్య క్రమంలో మాజీ సర్పంచ్ శ్రీశైలం, నాయకులు శంకర్, రవి, యాదయ్య, శ్రీను, జంగయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామంలో రూ.15 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఎస్‌డీఎఫ్ కింద రోడ్డు నిర్మాణానికి రూ.15 లక్షలు మంజూరయ్యాయని వారు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గుజ్జల మహేశ్, ఎస్సీసెల్ అధ్యక్షుడు చెన్నకేశవులు, నాయకులు వెంకట్‌రెడ్డి, వెంకట్‌రాజిరెడ్డి, కృష్ణయ్య, రఘుపతి, జంగయ్య, శ్రీశైలం, పెంటయ్య, మల్లేశ్‌గౌడ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి కమ్మగూడలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, సత్యనారాయణ స్వామి సన్నిధిలో శనివారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 17వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని వ్యవస్థాపకుడు హనుమాన్ దీక్షితులు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం క్షేత్రపాలకుల ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.
బీఆర్‌ఎస్ నాయకులపై ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతకరమైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టు చేసిన బీఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ నియోజకవర్గ అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రేవంత్ ప్రతిష్టతను దెబ్బతీసేవిధంగా సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టడం దారుణమన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో కిషోర్‌తో పాటు ఆ సంఘం నేతలు అయ్యాన్,సచిన్, వెంకట్ ఉన్నారు.

ఉత్సవాలకు ఆహ్వానం

ఉత్సవాలకు ఆహ్వానం

ఉత్సవాలకు ఆహ్వానం

ఉత్సవాలకు ఆహ్వానం