
ఫ్యూచర్ సిటీలో కలిపేందుకు కృషిచేస్తా
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో చేర్చాలని కోరుతున్న గ్రామాల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కలిపేలా తనవంతు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో తమ గ్రామాలను చేర్చాలని కోరుతూ మండల పరిధిలోని నేదునూరు, బాచుపల్లి, జైత్వారం, ధన్నారం, పులిమామిడి, చిప్పలపల్లి, మురళీనగర్, దావూద్‌గూడ, పెద్దమ్మతండాలకు చెందిన అఖిలపక్ష నాయకులు శనివారం ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబును కలవడానికి మినిస్టర్ క్వార్టర్లకు వెళ్లారు. కాగా అసెంబ్లీ సమావేశాల కారణంగా ఆయన వారితో కలవలేదు. అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ వారితో మాట్లాడారు. ఆయా గ్రామాల అభిప్రాయాన్ని మంత్రితో పాటు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఫ్యూచర్ సిటీలో కలిపేలా చూస్తానని వారికి ఆయన హామీనిచ్చారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్