
అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
కడ్తాల్: రాగి అంబలి కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మాజీ గవర్నర్ చెన్నకిషన్‌రెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం మండల కేంద్రంలో మహ్మద్ బాసిత్‌అలీ– ఖైరున్నీసా బేగం జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏటా లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బాటసారుల కోసం అన్నదానం, అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జావ తీసుకోవడం వలన చల్లదనంతో పాటు, పౌష్టికాహారం అందుతుందని చెప్పారు. కార్యక్రమంలో జహంగీర్‌అలీ, లాయఖ్‌అలీ, అజ్గర్‌అలీ, ఆసీఫ్‌అలీ, హిమాయత్‌అలీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, క్లబ్ సభ్యులు గోవర్ధన్‌రెడ్డి, రాజేందర్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్, మాజీ సర్సంచ్ వేణుగోపాల్, నాయకులు నేతిప్రభు, లింగం, ఇమ్రాన్‌బాబా, లక్ష్మయ్య ఉన్నారు.