
నేటి నుంచి ధ్యానోత్సవం
ఇబ్రహీంపట్నం: హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ, శ్రీ రామచంద్ర మిషన్ సంయుక్తంగా శని, ఆది, సోమవారాల్లో ఇబ్రహీంపట్నంలోని ఓసీ కమ్యూనిటీ హాల్‌లోఽ ధ్యానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15 సంవత్సరాలు దాటిన వారంతా ఈ ధ్యానోత్సవానికి హాజరు కావొచ్చని తెలిపారు. ధ్యానంతో కలిగే భౌతిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ఈ కార్యక్రమంలో వివరించనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ ప్లీడర్‌గా
గీతావనజాక్షి
మొయినాబాద్: పెద్దమంగళారం మాజీ సర్పంచ్, న్యాయవాది గీతావనజాక్షి అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారానికి చెందిన గీతావనజాక్షి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2013 నుంచి 2018 వరకు ఆమె గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. మహిళలకోసం లీగల్ క్లినిక్‌ను సైతం నడుపుతున్నారు. చేవెళ్ల జూనియర్ సివిల్ కోర్టు, ఇతర కోర్టులకు అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్‌గా ఆమెను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సేవలను గుర్తించి ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్‌గా నియమితులైన సందర్భంగా పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
వర్గీకరణ ప్రకారమే
ఉద్యోగాలు భర్తీ చేయాలి
షాద్‌నగర్: ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్స్‌తో పాటు అన్ని రకాల పరీక్ష ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ ఐదు రోజులుగా షాద్‌నగర్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన దీక్షలు చేపడుతున్నారు. దీక్ష శిబిరానికి శుక్రవారం గోవింద్ విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్గీకరణ అమలులో లేకపోవడంతో కొన్ని దశాబ్దాలుగా విద్య, ఉద్యోగ రంగాల్లో మాదిగలకు ఎంతో అన్యాయం జరుగుతోందని అన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈనెల 17న అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని ప్రకటించిన నేపథ్యంలో మాదిగలు అప్రమత్తంగా ఉండి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ మాదిగ, నాయకులు భిక్షపతి, శివ, పరుశరాం, చిర్ర శ్రీను, చెన్నగళ్ల శ్రావణ్‌కుమార్, పాండు, సురే ష్, బాల్‌రాజ్, శేఖర్, నాగేష్ పాల్గొన్నారు.
కుల్ఫీ ఐస్‌క్రీమ్, బర్ఫీ స్వీట్‌లలో గంజాయి
స్పెషల్ టాస్క్‌ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి..
సాక్షి, సిటీబ్యూరో/అబిడ్స్: హోలీ సంబరా లను సొమ్ము చేసుకొనేందు కు గంజాయి విక్రేతల ముఠా కొత్త పన్నాగం పన్నింది. హోలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం లోయర్ ధూల్‌పేట్‌లో కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, బర్ఫీ స్వీట్లకు సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎకై ్సజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 100 కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, 72 బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి కుల్ఫీ ఐస్‌క్రీమ్‌ల్లో గంజాయిని కలిపి విక్రయిస్తున్నట్లు సమా చారం అందడంతో దాడులు నిర్వహించినట్లు ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితో తయారైన వీటిని స్వాధీనం చేసుకుని, సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
దీక్ష చేపట్టిన ఎమ్మార్పీఎస్ నాయకులు