
ఎదురెదురుగా బైక్‌లు ఢీ
ఆర్టీసీ డ్రైవర్ మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
షాబాద్: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన షాబాద్ ఠాణా పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామానికి చెందిన మొగిలిగిద్ద సుధాకర్, కొత్తపల్లి బాలయ్య బైక్‌పై ఇంటికి వెళ్తున్నారు. అదే గ్రామానికి చెందిన తిమ్మక్క రజినీకాంత్ తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో అంతారం స్టేజీ వద్ద ఈ రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుధాకర్, రజనీకాంత్ తీవ్రంగా గాయపడడంతో షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిగి డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న సుధాకర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా బాలయ్య స్వల్పగాయాలతో బయటపడ్డాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారు డున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
బైక్‌ను ఢీకొట్టిన ఆటో
ద్విచక్ర వాహనదారుడి మృతి
మొయినాబాద్: బైక్ ను ఆటో ఢీకొట్టడంతో ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. ఈ ఘటన మొయినాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. చిలుకూరు గ్రామానికి చెందిన బక్క రాజు(35) బాలాజీ ఆలయం వద్ద టెంకాయలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో రాజు తన బైక్‌పై హిమాయత్‌నగర్ వెళ్లాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా చిలుకూరు మహిళ ప్రాంగణ సమీపంలో ఎదురుగా వస్తున్న అశోక్ లేలాండ్ ఆటో అతివేగంగా బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్రగాయాలవడంతో గమనించిన స్థానికులు స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కకు చేరుకుని మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారలు సంతానం. కేసు దర్యాప్తులో ఉంది.
టీచర్స్‌కు ఏఐపై శిక్షణ
శంషాబాద్ రూరల్: ఉపాధ్యాయులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఎంఈఓ వి.కిషన్‌నాయక్ అన్నారు. మండల విద్యా వనరుల కేంద్రంలో గురువారం ప్రభు త్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టుగా వెబ్ టూల్‌లో విద్యార్థులకు స్వీయంగా అభ్యసించే అవకాశా న్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని ఎంఈఓ అన్నారు.

ఎదురెదురుగా బైక్‌లు ఢీ