
వైద్యుల కోసం నిరీక్షణ
బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025
10లోu
కందుకూరు: కందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడంలేదు. ఉదయం 10 గంటలకు ఆయూష్‌కు చెందిన అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నాడు. బయట కొందరు రోగులు నిరీక్షిస్తున్నారు. వైద్యులు కానీ నర్సులు కానీ ఇతర ఉద్యోగులు కానీ ఎవరూ అందుబాటులో లేరు. పది గంటల తర్వాత ఒక్కొక్కరుగా వచ్చారు.
ఉదయం 8.20 గంటల నుంచి..
మా కుమారుడిని కుక్క కరిచింది. కడ్తాల్ నుంచి కందుకూరుకు ఉదయం 8.20 గంటలకు వచ్చాము. 10 గంటలకు కూడా చికిత్స చేయడానికి ఎవరూ లేరు. డాక్టర్ల కోసం ఎదురుచూస్తున్నాం.
కందుకూరు పీహెచ్‌సీ ఎదుట వైద్యుల కోసం నిరీక్షిస్తున్న రోగులు, వారి కుటుంబీకులు
న్యూస్‌రీల్
– రూప్‌సింగ్, కడ్తాల్

వైద్యుల కోసం నిరీక్షణ

వైద్యుల కోసం నిరీక్షణ