రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి | - | Sakshi
Sakshi News home page

రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి

Mar 9 2025 7:31 AM | Updated on Mar 9 2025 7:31 AM

రాజీప

రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి

ఆమనగల్లు: ఇరువర్గాలు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలని, రాజీమార్గం రాజమార్గమని ఆమనగల్లు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కాటం స్వరూప అన్నారు. ఆమనగల్లు పట్టణంలోని ప్రథమశ్రేణి న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు సంబంధించి 126 కేసులు పరిష్కారమయ్యాయి. అంతకుముందు న్యాయమూర్తి కాటం స్వరూప మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు నెలలకు ఒకసారి లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లోక్‌ అదాలత్‌లో ఇరువర్గాలు రాజీపడి చిన్నచిన్న కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు ప్రమోద్‌కుమార్‌, శివప్రసాద్‌, ఎకై ్సజ్‌ సీఐ బద్యానాథ్‌ చౌహాన్‌, ఎస్‌ఐలు వెంకటేశ్‌, వరప్రసాద్‌, శ్రీకాంత్‌, ఏపీపీ కార్తీక్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు ఆంజనేయులు యాదవ్‌, రామకృష్ణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపల్లి జగన్‌ తదితరులు ఉన్నారు.

లోక్‌ అదాలత్‌లతో సత్వర పరిష్కారం

చేవెళ్ల: లోక్‌ అదాలత్‌లతో కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని చేవెళ్ల కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి దశరథ రామయ్య అన్నారు. కోర్టు ఆవరణలో శనివారం మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 970 కేసులు పరిష్కరించారు. వీటికి సంబంధించి రూ.14,28,280 జరిమానాలు రికవరీ చేశారు. అనంతరం దశరథ రామయ్య మాట్లాడుతూ.. ఇరువరా్‌ుగ్ల రాజీకి వచ్చి పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌లు దోహదం చేస్తాయని అన్నారు. ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న కేసు లను సైతం పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ లోక్‌ అదాలత్‌లో ట్రాఫిక్‌ పోలీస్‌ కేసులకు సంబంధించి మొత్తం 446 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి సాంబశివరావు, చేవెళ్ల ట్రాఫిక్‌ సీఐ వెంకేటశం, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, న్యాయవాదులు, ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది, పాల్గొన్నారు.

మంత్రి దామోదరను కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి

ఆమనగల్లు: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహను శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉన్న 50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మారుస్తూ రూ.45.50 కోట్లు మంజూరు చేయడంపై నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

నేడు ఇండియాకు ప్రవీణ్‌కుమార్‌ మృతదేహం

కేశంపేట: అమెరికాలో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన గంప ప్రవీణ్‌కుమార్‌ మృతదేహం ఆదివారం ఇండియాకు రానుంది. మండల కేంద్రానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ బుధవారం అమెరికాలోని మిల్వాకీ పట్టణంలో దుండగుల కాల్పులో మృతి చెందిన సంగతి తెలిసిందే. అమెరికాలో పోస్టుమార్టంతో పాటు లాంచనాలు పూర్తికావడంతో మృతదేహాన్ని తానా సభ్యులు, బంధువుల సహకారంతో ఇండియాకు తరలించారు. ఆదివారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రానున్నట్టు బంధువులు, గ్రామస్తులు తెలిపారు. అక్కడి నుంచి కేశంపేటకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి 
1
1/3

రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి

రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి 
2
2/3

రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి

రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి 
3
3/3

రాజీపడండి.. కేసులు పరిష్కరించుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement