సినిమా షూటింగ్‌లో అపశ్రుతి | - | Sakshi
Sakshi News home page

సినిమా షూటింగ్‌లో అపశ్రుతి

Mar 9 2025 7:29 AM | Updated on Mar 9 2025 7:29 AM

సినిమ

సినిమా షూటింగ్‌లో అపశ్రుతి

శంకర్‌పల్లి: ఓ సినిమా షూటింగ్‌లో అపశ్రుతి చో టు చేసుకుంది. ట్రాన్స్‌ ఫార్మర్‌ వద్ద విద్యుత్‌ సరఫరా నిలిపివేసేందుకు వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి మండల పరిధిలోని టంగుటూరు శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకా రం.. టంగుటూరుకు చెందిన మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌, బీజేపీ నేత బద్ధం శంభారెడ్డి(47) సిని ఇండసీ్ట్ర వారికి సుపరిచితుడు. మండల పరిధిలో చేసే షూటింగ్‌లకు అనుమతులు ఇప్పిస్తుంటాడు. కాగా శుక్రవారం గ్రామ శివారు పంట పొలాల్లో ‘ఓదేల.. ది రైల్వేస్టేషన్‌’ సినిమా షూటింగ్‌ ఉంది. షూటింగ్‌ బృందానికి చెందిన ఓ భారీ క్రేన్‌ రావడంతో విద్యుత్‌ వైర్లకు తగులుతుందేమోనని శంభారెడ్డి ట్రాన్స్‌ఫార్మర్‌(జంపర్‌)ను ఆఫ్‌ చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. షూటింగ్‌ బృందం వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా రాత్రి విధుల్లో ఉన్న పెట్రోలింగ్‌ వాహనంలో సిబ్బంది, నార్సింగి సీఐ హరికృష్ణారెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాస్పత్రి మార్చురికీ తరలించారు. మృతుడికి భార్య లావణ్య, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివే మణివర్ధన్‌రెడ్డి, శిరీష ఉన్నారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మోకిల ఠాణాలో మృతుడి కుటుంబీకులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు సూచించారు.

రెండు గంటల పాటు ధర్నా

కాగా పోలీసులు సినీ ఇండసీ్ట్ర వారితో కుమ్మకై ్క ఆధారాలు లభించకుండా మృతదేహాన్ని మార్చురికీ తరలించారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన రైతు ఘటనా స్థలికి వెళ్లగా.. ఎవరికీ చెప్పొద్దంటూ వెనక్కి పంపించారని వాపోతున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా తరలిస్తారంటూ శనివారం మోకిల చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు వాహనాల దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌.రత్నం ధర్నాకు మద్దతు తెలిపారు. అనంతరం నార్సింగి ఏసీపీ రమణగౌడ్‌ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

ఎమ్మెల్యే పరామర్శ

శంభారెడ్డి మరణవార్త తెలుసుకున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మృతుడి ఇంటికి వెళ్లా రు. వారికి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. అనంతరం ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు.

విద్యుదాఘాతంతో మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ మృతి

మృతదేహాన్ని మార్చురీకి తరలించిన పోలీసులు

సమాచారం ఇవ్వలేదని

మృతుడి కుటుంబీకుల ధర్నా

ఏసీపీ రమణగౌడ్‌ జోక్యంతో

ఆందోళన విరమణ

సినిమా షూటింగ్‌లో అపశ్రుతి 1
1/1

సినిమా షూటింగ్‌లో అపశ్రుతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement