షాబాద్: ఒకవైపు బ్రాంచ్ పోస్టుమాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ.. మరోవైపు ఇద్దరు ఆడపిల్లలను చదివించి ప్రయోజకులను చేసి వివాహాలు జరిపించారు మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి కందివనం పద్మ. భర్త కై లాస్‌గౌడ్ 15 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుటుంబ భారం ఆమైపె పడింది. భర్త చేస్తున్న ఉద్యోగాన్ని చేపట్టింది. తండ్రి లేని లోటు తెలియకుండా ఇద్దరు ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా పెంచింది. డిగ్రీ వరకు చదివించి పెళ్లిళ్లు చేసింది. ఇప్పటికీ ఇల్లిల్లూ తిరుగుతూ ఉత్తరాలు బట్వాడా చేస్తూ.. పింఛన్లు అందిస్తూ.. ఊరివాళ్లతో కలుపుగోలుగా మెలుగుతూ జీవనం సాగిస్తోంది. ‘ఎన్ని సమస్యలు ఎదురైనా మహిళలు సహనాన్ని కోల్పోవద్దని.. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని.. సహనం, పట్టుదల ఉంటే ఎలాంటి లక్ష్యమైన చేరుకోగలం’ అని చెబుతోంది.
వందనం.. ‘కందివనం’
వందనం.. ‘కందివనం’