
లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుని..
నాన్న టీఎస్ నరసింహన్ సహా ఇంట్లో అంతా ఉన్నత చదువులు చదివిన వారే. నాకు ముగ్గురు బ్రదర్స్. వివిధ రంగాల్లో స్థిరపడ్డా రు. నాన్న స్ఫూర్తితో చదువుకున్నా. స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా అయినప్పటికీ పుట్టిపెరిగింది మొదలు.. ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే. సెంట్రల్ వర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేశా. గ్రూప్స్ రాశాను. తొలి ప్రయత్నంలో రాకపోవడంతో ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పని చేశాను. గ్రూప్–1కు ప్రిపేరయ్యాను. గ్రూప్–2 పరీక్ష రాసి, విదేశాలకు వెళ్లాలని భావిస్తున్న సమయంలో ఫలితం వచ్చింది. హైదరాబాద్‌లో ట్రైనింగ్.. వరంగల్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటి కలెక్టర్ సుమితా దావ్రా డీఆర్‌డీఏ పీడీగా నియమించారు. గ్రూప్–2 కేడర్‌కు చెందిన ఓ మహిళా ఉద్యోగిని, గ్రూప్–1 కేడర్ పోస్టులో ఎలా కూర్చొబెడతారని జాయినింగ్ రోజే పురుష ఉద్యోగుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నా. వారి సవాల్‌ను చాలెంజ్‌గా తీసుకున్నా. సమర్థవంతంగా పని చేశా. తర్వాత వివిధ జిల్లాల్లో, ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించా. ఒక వైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు ప్రభుత్వ అధికారిగా విధులు.. లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగుతున్నా.
– టీఎల్ సంగీత, జిల్లా రెవెన్యూ అధికారి