అనంతగిరి: బాలికలు ఉన్నత విద్యనభ్యసించేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రాష్ట్ర ఆడపిల్లల సమానత్వ సమాఖ్య పనిచేస్తోంది. ఉన్నత విద్యతోనే లింగసమానత్వం సాధ్యమనే ఉద్దేశంతో ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో ఈ సమాఖ్య పోరాడుతోంది. గతేడాది మే లో ఏర్పడిన ఈ సంఘం కన్వీనర్‌గా కృప, జిల్లా కన్వీనర్‌గా జ్యోతి ఉన్నారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న బాలికలు ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. ఆరు జిల్లాల్లో ఆక్టివ్‌గా పనిచేస్తోంది. జిల్లా కమిటీలో 30మంది బాలికలున్నారు. బాలికలను విద్యాలక్ష్మిని చేయడమే సంఘం ఆశయం.