ఆమోదం | - | Sakshi
Sakshi News home page

ఆమోదం

Mar 7 2025 9:24 AM | Updated on Mar 7 2025 9:20 AM

అగ్నికి ఆహుతైన కంది ఓ రైతు వేసిన కంది పంట అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్‌ మండలం కొండన్నగూడలో చోటు చేసుకుంది.
అద్భుత నగరికి

శుక్రవారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2025

8లోu

ఫ్యూచర్‌ సిటీ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌కు దీటుగా నాలుగో నగరం ఆవిష్కృతం కాబోతోంది. ఇటు శ్రీశైలం, అటు నాగార్జునసాగర్‌ జాతీయ రహదారుల మధ్యలో ఉన్న ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలతో సుమారు 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్‌ సిటీ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ’ పేరుతో మరో అద్భుత నగరం ఆవిష్కరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపిపంది. ఈ మేరకు గురువారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు ఓఆర్‌ఆర్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్యలో హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను కూడా కొత్త గా ఏర్పాటు చేసే ఎఫ్‌డీసీఏలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి కోసం కొత్తగా 90 పోస్టులను సృష్టించడమే కాకుండా, వాటి భర్తీకి ఆమోదం కూడా తెలిపింది. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ శంకుస్థాపనతో ఇప్పటికే ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ 13 నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు నిర్మించతలపెట్టిన 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్‌ (రతన్‌టాటా) రోడ్డుకు భూసేకరణ చేపట్టింది. తొలి దశలో 19.2 కిలోమీటర్లకు రూ.1,665 కోట్లు కేటాయించింది. అదే విధంగా రెండో విడతలో 22.30 కిలోమీటర్ల దూరంలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు రూ.2,365 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ఫ్యూచర్‌ సిటీ స్వరూపం ఇలా..

న్యూస్‌రీల్‌

ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలు

కొత్తగా 90 పోస్టులు సృష్టి మంత్రిమండలి ఆమోదం

ఆమోదం 1
1/1

ఆమోదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement