జగద్గిరిగుట్ట: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ కు చెందిన రాజు (40) ఆస్ బెస్టాస్ కాలనీలో ఉంటూ సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసైన రాజు నెల రోజులుగా పనికి వెళ్లడం లేదు. గురువారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న అతను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాండూరు ఇన్‌చార్జ్ డీఎల్‌పీఓగా రతన్‌సింగ్
తాండూరు రూరల్: తాండూరు డివిజన్ ఇన్‌చార్జ్ డీఎల్‌పీఓగా రతన్‌సింగ్ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేసిన శంకర్‌నాయక్ నల్లొండ జిల్లా దేవరకొండకు బదిలీపై వెళ్లారు. దీంతో పెద్దేముల్ ఎంపీఓగా పని చేస్తున్న రతన్‌సింగ్ తాండూరులోని డీఎల్‌పీఓ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను ఎంపీడీఓ విశ్వప్రసాద్ సన్మానించారు.
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య