చరికొండ వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం అత్యంత వైభవంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. రుక్మిణీసత్యభామా సమేత గోవిందుడి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను బ్యాండు మేళాలతో గ్రామంలో ఊరేగించారు. వేదపండితులు చక్రవర్తి శ్రీనివాసచార్యులు, రామచార్యులు, కృష్ణమాచార్యుల బృందం వేదమంత్రోచ్ఛారణ మధ్య కల్యాణం జరిపించారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు మహిళలు, భక్తులు భారీగా తరలివచ్చారు. డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, మాజీ సర్పంచ్ నర్సింహ్మగౌడ్, మాజీ ఎంపీటీసీ పాలకూర్ల రాములుగౌడ్, మాజీ ఉప సర్పంచ్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. – కడ్తాల్
● అపురూప వేడుక