మీర్‌పేట: జిల్లెలగూడలోని మత్స్యావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలోని గోశాల వివాదం సద్దుమణిగింది. గోపాలకృష్ణ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఆలయంలో గోశాల నిర్వహిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన విషయాలు ఆలయ అధికారులకు తెలపకపోవడంతో గోశాలను తిరిగి అప్పగించాలని అధికారులు, మాజీ ధర్మకర్తలు పలుమార్లు కోరినా ఆయన నిరాకరించాడు. దీంతో బుధవారం గోపాలకృష్ణ, అతనికి మద్దతుగా స్థానిక బీజేపీ నాయకులు ఆలయం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గోశాలను తిరిగి అప్పగిస్తున్నట్లు గోపాలకృష్ణ ఒప్పంద పత్రం ఇవ్వడంతో వివాదం సమసింది.