
జ్యోతిప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిస్తున్న పురుష్తోతంరెడ్డి తదితరులు
కందుకూరు: పోలీసుల తనిఖీలో రూ.35 లక్షల నగదు పట్టుబడిన సంఘటన మండలంలోని ఫార్మాసిటీ రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. ఎన్నికల నేపథ్యంలో ఫార్మా రోడ్డులో ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ సిబ్బంది, కందుకూరు పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ కారులో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి కరపత్రాలతో పాటు రూ.35 లక్షలు గుర్తించారు. నగదును స్వాధీనం చేసుకొని కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని విచారిస్తున్నారు.
విద్యార్థులు మేధోశక్తిని
పెంపొందించుకోవాలి
మొయినాబాద్‌రూరల్: విద్యార్థులు మేధోశక్తిని పెంపొందించుకునేందుకు అన్ని రంగాల్లో పాలు పంచుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫార్మసిస్టు అసోసియేషన్ రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్‌వీ పురుష్తోతంరెడ్డి అన్నారు. హిమాయత్‌నగర్ సమీపంలోని చైతన్య డిమ్డ్ టు బీ విశ్వవిద్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించే ఫార్మసీ కాన్ఫరెన్స్ శుక్రవారం ప్రారంభమైంది. సదస్సుకు జాతీయ స్థాయిలో వివిధ కళాశాలల్లోని 500 మంది విద్యార్థులకుపైగా హాజరయారు. ఈ సందర్భంగా పురుష్తోతంరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులతో విద్యార్థులకు విజ్ఞానం పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి సువర్ణదేవి, చీఫ్ పాట్రన్ విశ్వభారతి ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్‌రెడ్డి, అడ్మినిస్ట్రేట్ అధికారి డాక్టర్ సాత్విక, వైస్‌చాన్సలర్ ఆచార్య జి.దామోదర్, రిజిస్ట్రార్ ఎం.రవీందర్, కళాశాల డీన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి
దినేష్ సాగర్ గుడ్‌బై
మంత్రి కేటీఆర్ సమక్షంలో
బీఆర్‌ఎస్‌లో చేరిక
షాద్‌నగర్: ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కన్వీనర్ దినేష్ సాగర్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మంత్రి కేటీఆర్‌ను కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దినేష్‌సాగర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ వద్ద డబ్బులు తీసుకొని ద్రోహం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌పార్టీ నేతలు తమపై ఎన్నో అభాండాలు వేశారని అన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని పని చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు.

కందుకూరులో పట్టుబడిన నగదు
Comments
Please login to add a commentAdd a comment