
జ్యోతిని అభినందిస్తున్న పాఠశాల చైర్మన్ అల్లాజీగౌడ్
ఆమనగల్లు: విశ్వం ఎడ్యుటెక్ స్కూల్ ల్యాబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో ఆమనగల్లు లిటిల్‌స్కాలర్స్ టెక్నోస్కూల్ 7వ తరగతి విద్యార్థిని జ్యోతి జిల్లా స్థానంలో నిలిచింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన వేదిక్ మ్యాథ్స్ పోటీల్లో జిల్లా స్థాయిలో 20 పాఠశాలల నుంచి దాదాపు వెయ్యిమంది విద్యార్థులు పాల్గొనగా జ్యోతి మొదటి బహుమతి సాధించింది. దీనితో జ్యోతిని పాఠశాల చైర్మన్ చుక్క అల్లాజీగౌడ్, డైరెక్టర్ సావిత్రిలు అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో అకాడమిక్ అడ్వయిజర్ సుదర్శన్‌రెడ్డి, కరస్పాండెంట్ సుజాతరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.