నిర్లక్ష్యం చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం చేస్తే చర్యలు

Jul 26 2026 7:42 AM | Updated on Jul 26 2026 7:42 AM

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

● ఎస్పీ మహేశ్‌ బీ గీతే

సిరిసిల్ల: విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే పోలీస్‌శాఖ పరంగా చర్యలు తప్పవని ఎస్పీ మహేశ్‌ బీ గీతే హెచ్చరించారు. జిల్లా ఆఫీస్‌ ఆవరణలోని పరేడ్‌ మైదానంలో శనివారం జిల్లా ఆర్ముడ్‌ రిజర్వ్‌, సివిల్‌, హోమ్‌గార్డ్‌ సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్‌కు ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజల మన్నలను పొందేలా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, నిత్యం కనీసం అరగంట నడక అలవాటు చేసుకోవాలని సూచించారు. బయట ఆహారాన్ని వీలైనంత మేరకు తినొద్దని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందుతూ జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐలు మధుకర్‌, సురేష్‌, రమేశ్‌, ఆర్‌ఎస్సైలు రా జు, శ్రవణ్‌యాదవ్‌, దిలీప్‌, సాయికిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement