వేములవాడలో...
సిరిసిల్లలో..
బోయినపల్లిలో..
వేములవాడ/సిరిసిల్లటౌన్/బోయినపల్లి(వేములవాడ): ఆషాఢ మాసం ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోచమ్మకు బోనాలు తీశారు. వేములవాడలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకుల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. బోనం ఎత్తుకొని మహిళలను ఉత్సాహ పరిచారు. సిరిసిల్లలోని 26వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేశ్ పోచమ్మతల్లికి బోనం మొక్కులు చెల్లించుకున్నారు. బోయినపల్లిలో పద్మశాలి సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు తీశారు. సర్పంచ్ మోహన్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిల్ల మల్లేశం, తడుక రామానుజం తదితరులు పాల్గొన్నారు.


