డీడీలు చెల్లించినా రావడం లేదు | - | Sakshi
Sakshi News home page

డీడీలు చెల్లించినా రావడం లేదు

Apr 27 2026 8:18 AM | Updated on Apr 27 2026 8:18 AM

మేము మూడు రోజుల కిందటే డీజిల్‌, పెట్రోల్‌ కోసం బ్యాంకు ద్వారా డీడీలు తీసి పంపించాం. కంపెనీ ఆఫీసర్లతో మాట్లాడుతున్నాం. వస్తుందంటూనే పంపడం లేదు. మా బంకును ఎప్పుడూ మూసివేయకుండా సమర్థంగా నడపాలని భావిస్తాం. వాహనదారులకు మా పెట్రోల్‌ బంకుపై ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నాం.

– పుల్లూరి కృష్ణమూర్తి,

పెట్రోల్‌ బంకు యజమాని, సిరిసిల్ల

కంపెనీల ప్రతినిధులతో మాట్లాడుతాం

జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఇంధన కొరత ఉన్నట్లు మాకు సమాచారం లేదు. ఎక్కడైనా సమస్య ఉంటే.. సకాలంలో ఇంధన కంపెనీలకు డబ్బులు చెల్లించకపోతేనే ఈ సమస్య వస్తుంది. అయినా ఇంధన కంపెనీల సేల్స్‌ ఆఫీసర్లతో మాట్లాడుతాం. జిల్లాలోని పెట్రోల్‌, డీజిల్‌ బంకుల్లో కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం.

– ఎల్‌.బుచ్చిబాబు, డీసీఎస్‌వో

Advertisement
 
Advertisement
Advertisement