ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండల పరిషత్‌లో సోమవారం 140 మందికి రూ.38,08,500 విలువైన సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కిష్టారావుపల్లి జీపీ నూతన భవన ప్రారంభోత్సవం, పత్తికుంటపల్లిలోని ఫంక్షన్‌హాలు పనులను ప్రారంభించారు. ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్‌లో పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఐరెడ్డి చైతన్య, మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు వి.వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కె.భాస్కర్‌రెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ పాశం రాజేందర్‌రెడ్డి, సర్పంచులు జక్కుల మల్లవ్వ తిరుపతి, మామిడి రాజు, అరుకాల నవీన్‌కుమార్, నేరెళ్ల విజయ్‌గౌడ్, అనంతగిరి టెంపుల్ చైర్మన్ కోలాపురి అంతగిరి, ఏఎంసీ వైస్‌చైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి ప్రతీ కార్యకర్త కృషిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. బీజేపీ 47వ స్థాపన దివస్ సందర్భంగా సోమవారం జిల్లా కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఎగురవేశారు. గోపి మాట్లాడుతూ దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీని మరింత బలపర్చడానికి కార్యకర్తలు సైనికుడిలా పనిచేయాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: ఇబ్బందులు పడుతున్న వస్త్రోత్పత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతపై సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. తమ విద్యుత్ కనెక్షన్లు మూడో కేటగిరీలో ఉండడంతో ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించిన విద్యుత్ రాాయితీ అందడం లేదన్న విషయాన్ని ఈనెల 2న ఎన్పీడీసీఎల్ సీఎండీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ వస్త్రోత్పత్తిదారుల విద్యుత్ మీటర్లకు నాలుగో కేటగిరీకి మార్చి సమస్యను పరిష్కరించారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షడు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆంకాలపు రవి, కళ్యాణపు సుభాష్, దూడం శంకర్, గోవిందు రవి, దూస భూమయ్య, బొద్దుల సుదర్శన్, మండల సత్యం తదితరులు పాల్గొన్నారు.
భీమన్న సేవలో ఎస్పీ
వేములవాడఅర్బన్/సిరిసిల్లక్రైం: భీమేశ్వరస్వామివారిని ఎస్పీ మహేశ్ బీ గీతే సోమవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేశారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్సై రాజు ఉన్నారు.
నిర్భయంగా ఫిర్యాదు చేయాలి
మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం షీటీమ్ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. వేధింపులు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచించారు. మార్చిలో మూడు ఎఫ్‌ఐఆర్‌లు, నాలుగు పెట్టి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వేధింపులు ఎదురైతే వెంటనే 87126 56425లో సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు.


