విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి స్థల పరిశీలన

Apr 7 2026 9:13 AM | Updated on Apr 7 2026 9:13 AM

సిరిసిల్ల/చందుర్తి(వేములవాడ): జిల్లాలో కొత్తగా మూడు విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌, చందుర్తి మండలం లింగంపేట, ఎన్గల్‌ గ్రామాల్లోనూ విద్యుత్‌ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి స్థలాలను ఎన్పీడీసీఎల్‌ డైరెక్టర్‌(ప్రాజెక్ట్స్‌) వి.మోహన్‌రావు సోమవారం పరిశీలించారు. మోహన్‌రావు మాట్లాడుతూ సిరిసిల్ల ప్రాంతంలో పెరుగుతున్న విద్యుత్‌ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సబ్‌స్టేషన్‌ ఏర్పాటుతో లో వోల్టేజీ సమస్యలు తగ్గి, సరఫరా వ్యవస్థ బలపడుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు భూమి అనుకూలంగా ఉందా? లేదా ? భూసార పరీక్షలు చేయించాలని పరిశీలించారు. సిరిసిల్ల సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీరు(ఆపరేషన్స్‌) బి.భిక్షపతి, డీఈఈ అంజయ్య ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement