ఘనంగా పునఃప్రతిష్టాపన | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పునఃప్రతిష్టాపన

Apr 7 2026 9:13 AM | Updated on Apr 7 2026 9:13 AM

గంభీరావుపేట: గజసింగవరంలో నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు ఆధ్వర్యంలో శ్రీరామలింగేశ్వరస్వామి పునర్‌ ప్రతిష్టానోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో కొండూరి రవీందర్‌రావు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, చీటి నర్సింగరావు, జిందం చక్రపాణి, సెస్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌, కొమిరిశెట్టి లక్ష్మణ్‌, లక్ష్మణ్‌రావు, సర్పంచ్‌ విమల హాజరయ్యా రు. మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పూజలు చేశారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

సిరిసిల్ల అర్బన్‌: రాష్ట్రస్థాయి ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు జిల్లా నుంచి 25 మంది విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్‌ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో సోమవారం జిల్లాస్థాయి ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. అండర్‌–20 బాలబాలికలు, మెన్‌ అండ్‌ ఉమెన్‌కు అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులు ఈనెల 11, 12 తేదీల్లో హన్మకొండలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాస్‌, రాజు, అశోక్‌, సాయికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement