బస్సుల సంఖ్య పెంచండి● మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విప్ ఆది శ్రీనివాస్ విన్నపం
వేములవాడ: వేములవాడకు అన్ని ప్రాంతాల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు బస్సుల సంఖ్య పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ శనివారం వినతిపత్రం అందించారు. అసెంబ్లీ కమిటీ హాల్–1లో ఆర్టీసీ సమస్యలపై ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖీలో విప్ పాల్గొన్నారు. వేములవాడకు సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, మెట్‌పల్లి డిపోల నుంచి బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. కథలాపూర్ మండలం రాజారాంతండా, కథలాపూర్ కొండాపూర్ వరకు, గంభీర్‌పూర్ వరకు వస్తున్న బస్సులను మోత్కురావుపేట, గోవిందారం వరకు పెంచాలని కోరారు. చందుర్తి నుంచి మర్రిమడ్ల వరకు బస్సులు నడపాలని కోరారు.
● కారు ఢీకొని వృద్ధురాలు మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రం శివారులోని శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రుద్రంగి వైపు నుంచి కోరుట్ల వైపు వెళ్తున్న టిప్పర్, కోరుట్ల నుంచి వస్తున్న బైక్ రుద్రంగిశివారులో ఢీకొన్నాయి. ఈ ఘటనలో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన బూస గంగాధర్ తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్స్‌లో కోరుట్లలోని ఆస్పత్రికి తరలించారు.
పెన్షన్ డబ్బుల కోసం వచ్చి మృత్యువాత
సిరిసిల్ల అర్బన్: పెన్షన్ తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తున్న క్రమంలో వాహనం రూపంలో మృత్యువు ఆ వృద్ధురాలిని కానరాని లోకాలకు తీసుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దబోనాలకు చెందిన దానవేని నర్సవ్వ(80) పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు స్థానిక బైపాస్‌రోడ్డు పక్కన ఉన్న బ్యాంకుకు వెళ్లింది. పెన్షన్ తీసుకొని ఇంటికొస్తుండగా కామారెడ్డి నుంచి వేములవాడ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. కాలు విరిగి దూరంలో ఎగిరిపడింది. మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి నర్సవ్వ రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బైపాస్ రోడ్డు వెంట గాలించడంతో మృతిచెంది కనిపించింది. నర్సవ్వకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.