● ఏప్రిల్ 7న పంపిణీ ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
వేములవాడఅర్బన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన గోశాల కోడెలు ఉచితంగా పంపిణీ చేస్తామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ శనివారం తెలిపారు. తిప్పాపూర్‌లోని గోశాలలో 300 కోడెలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏప్రిల్ 7న రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైతులు కోడెలను పొందేందుకు అర్హులని స్పష్టం చేశారు. కోడెల కోసం 1.5 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచి ంచారు. వివిధ ధ్రువీకరణపత్రాలతో https://rajannasiricilla.telan gana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన రైతులకే జియో ట్యాగింగ్ కోడెలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కోడెలు తీసుకెళ్లే రైతులు వాటి సంరక్షణ బాధ్యతను సక్రమంగా చూసుకోవాలని సూచించారు. కో డెలు పక్కదారి పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


