కష్టంలోనూ తోడునీడగా.. | - | Sakshi
Sakshi News home page

కష్టంలోనూ తోడునీడగా..

Mar 28 2026 7:31 AM | Updated on Mar 28 2026 7:31 AM

కష్టంలోనూ తోడునీడగా.. ● పక్షవాతంతో బాధపడుతున్న భర్త ● పసిబిడ్డలా సేవచేస్తున్న భార్య ● ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ దంపతులు వీర్నపల్లి(సిరిసిల్ల): ఒకరికి ఒకరు తోడునీడగా నిలిస్తేనే బంధాలకు అర్థం ఉంటుంది. చిన్నపాటి కారణాలతో విడిపోతున్న జంటలు ఇప్పుడు కోకొల్లలు. కానీ వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్న భర్తే ప్రాణంగా ఓ ఇల్లాలు సేవ చేస్తుంది. పక్షవాతంతో బాధపడుతున్న భర్తకు అన్నీ తానై పసివాడిలా కాపడుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం సీతారాంనాయక్‌తండాకు చెందిన అజ్మీరా రామ్‌రెడ్డి, జమున దంపతులు. రామ్‌రెడ్డి పక్షవాతం బారినపడ్డారు. శరీరం సహకరించక, కనీసం తన పనులు తాను చేసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే తోడుగా ఉంటూ మనోధైర్యం కల్పిస్తోంది జమున. రోజూ ఉదయాన్నే భర్తకు స్నానం చేయించడం, బట్టలు మార్చడం దగ్గర నుంచి గోరుముద్దలు తినిపిస్తూ ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది. వీరి అనురాగాన్ని చూసి తండావాసులే ఆశ్చర్యపడుతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వెంటే ఉండాలని నిరూపిస్తున్న ఈ వృద్ధ దంపతులు నేటి యువజంటలకు ఆదర్శమని స్థానికులు కొనియాడుతున్నారు. స్వామి వారి లడ్డూకు రూ.70వేలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్‌లోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దత్తత శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని స్వామివారి లడ్డూకు రూ.70వేల వేళం పాటపాడా రు. ఈ లడ్డూను గ్రామానికి చెందిన వంగల లింగారెడ్డి–శోభ దంపతులు దక్కించుకున్నారు. బచ్చు మోహన్‌ రూ.40వేలతో స్వామి వారి వ్రతానికి మెట్లు చేయించారు. ఎల్లారెడ్డిపేట అశ్విని ఆస్పత్రి వైద్యుడు సత్యనారాయణస్వామి రూ.50వేలతో అన్నదానం చేశారు. సర్పంచ్‌ దొమ్మాటి నర్సయ్య, ఉపసర్పంచ్‌ మోతె మధుసూదన్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ సాబేరబేగం, వైస్‌చైర్మన్‌ గుండాడి రామ్‌రెడ్డి, డీటీ ఎలుసాని ప్రవీణ్‌కుమార్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ మోతె లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement