స్కానింగ్‌ సెంటర్లపై నిఘా | - | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌ సెంటర్లపై నిఘా

Mar 26 2026 7:36 AM | Updated on Mar 26 2026 7:36 AM

సిరిసిల్ల: గర్భస్థ లింగనిర్ధారణ నిరోధక చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత కోరారు. జిల్లా వైద్యాధికారి ఆఫీ స్‌లో జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. రజిత మాట్లాడుతూ భ్రూణ హత్యలు అరికట్టడానికి, లింగ నిష్పత్తిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10వేల జరి మానా, మూడేళ్ల జైలుశిక్ష విధించనున్నట్లు తెలిపా రు. మానేరు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్‌, సలహా సంఘం కన్వీనర్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ నాగేంద్రబాబు, గైనకాలజిస్ట్‌ సూచేత లక్ష్మి, డాక్టర్లు సాయికుమార్‌, ఆదిత్య, రామకృష్ణ, నహీ మ, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement