గోదావరిఖని: నగరంలోని హైకింగ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేశామని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అరవింద్‌రెడ్డి తెలిపారు. వంటగది, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు, పిండి పదార్థాల్లో బొద్దింకలు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. 35 కిలోల గోధుమపిండి, 10 కిలోల మైదాపిండిని పారబోయిచారు. నిల్వఉంచిన మాంసం, గడువు ముగిసిన పెరుగు, తందూరి చికెన్, పచ్చి చికెన్ స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశామన్నారు. నిల్వ ఉంచిన సలాడ్లను నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి పారబోశామన్నారు. ఆహార తయారీలో ఉపయోగిస్తున్న సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను(ఆహార రంగులు) గుర్తించి వాటిని తొలగించాలని నిర్వాహకులకు సూచించామని అన్నారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం లైసెన్సింగ్ నిబంధనలు (2011) ఉల్లంఘించినందుకు రెస్టారెంట్ యజమానులపై కేసు నమోదు చేయనున్నట్లు వివరించారు.


