● కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్
ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని ముస్తాబాద్, తంగళ్లపల్లి మండలాల్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లెలో రూ.25లక్షలతో నిర్మించిన పనులు, శివాజీ విగ్రహాన్ని స్థానిక సర్పంచ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ముస్తాబాద్‌లో బిజీబిజీ
ముస్తాబాద్‌లో ఎన్‌ఆర్‌ఐఈజీఎస్ ద్వారా మంజూరైన నిధులతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ భూమిపూజ చేశారు. సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి గృహంలో జరిగిన హన్‌మాన్ పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నమనేని వికాస్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మండలాల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్‌రావు, సౌల్ల క్రాంతి, ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి పాల్గొన్నారు.


