రాజీయే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీయే రాజమార్గం

Mar 29 2026 6:56 AM | Updated on Mar 29 2026 6:56 AM

సిరిసిల్లటౌన్‌/వేములవాడ: రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ పేర్కొన్నారు. సిరిసిల్లలోని కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 14,820 కేసులు పరి ష్కరించినట్లు తెలిపారు. రూ.6,74,41,119 పరిహారంగా ఇప్పించినట్లు వివరించారు. ప్రమాద కేసులు 13, సివిల్‌ తగాదాలు 17, క్రిమినల్‌ కేసులు 330, ఎకై ్సజ్‌ కేసులు 43, చెక్‌బౌన్స్‌ కేసులు 20, కుటుంబ తగాదాలు 10, బ్యాంకు కేసులు 45, బీఎస్‌ఎన్‌ఎల్‌ 10, డ్రంకెన్‌డ్రైవ్‌ 1,851, ట్రాఫిక్‌ చలా న్‌ కేసులు 12,481 పరిష్కారమయ్యాయి. పోక్సో కోర్టు జడ్జి రాధికా జైశ్వాల్‌, సబ్‌కోర్టు జడ్జి లక్ష్మణాచారి, ఏఎస్పీ చంద్రయ్య, లోక్‌అదాలత్‌ మెంబర్‌ చింతోజు భాస్కర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

వేములవాడలో 832 కేసులు

జాతీయ లోక్‌అదాలత్‌లో 832 కేసులు పరిష్కారమైనట్లు వేములవాడ జూని యర్‌ సివిల్‌ జడ్జి జ్యోతిర్మయి తెలిపారు. గొడవపడ్డ అన్నదమ్ములు రాజీ కుదుర్చుకోవడంతో శాలువాతో సత్కరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిసె సదానందం, లోక్‌ అదాలత్‌ మెంబర్లు నాగుల సత్యనారాయణ, నక్క దివాకర్‌, ఏజీపీలు బొడ్డు ప్రశాంత్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement