న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
రాజన్న సన్నిధిలో..
వేములవాడ రాజన్న అనుబంధ భీమేశ్వరాలయంలో ప్రధాన అర్చకుడు చంద్రగిరి శరత్‌శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పండితులను సత్కరించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉత్సవమూర్తులను దర్శించుకొని పూజలు చేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్ దర్శించుకున్నారు.
సిరిసిల్లటౌన్/వేములవాడ: తెలుగు నవవత్సరం పరాభవంలో ప్రజలు సుఖసంతోషాలతో విరజిల్లుతారని సిద్ధాంతులు, పంచాంగకర్తలు పేర్కొన్నారు. సిరిసిల్ల శ్రీవేంకటేశ్వరస్వామి, వేములవాడ భీమన్న ఆలయాల్లో గురువారం పంచాంగ శ్రవణం నిర్వహించారు. పండుగను పురస్కరించుకొని కొత్తకుండలో షడ్రుచుల మేళవింపుతో తయారు చేసిన పచ్చడిని సేవించారు. సిరిసిల్లలోని వెంకన్న క్షేత్రం, మార్కండేయ ఆలయం, శివసాయిబాబా, వాసవీ కన్యకాపరమేశ్వరీ, బీవై నగర్ భక్తాంజనేయ, విద్యానగర్ అభయాంజనేయస్వామి, నెహ్రూనగర్ హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
పార్టీ కార్యాలయాల్లో...
సిరిసిల్లలోని బీఆర్‌ఎస్ ఆఫీసులో పంచాంగ శ్రవణం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, కుంభాల మల్లారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు పాల్గొన్నారు.


