బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని విలాసాగర్, దేశాయిపల్లి పరిసరాల్లోని వరదకాలువకు ఎల్లంపల్లి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విలాసాగర్ రైతులు గురువారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిసి విన్నవించారు. నీరు విడుదల చేస్తే పంటలకు అందుతుందన్నారు. స్పందించిన ఎమ్మెల్యే సత్యం వెంటనే నీరు విడుదల చేయాలని ఎల్లంపల్లి ఈఈ సత్యనారాయణను ఫోన్‌లో ఆదేశించారు. రైతులు గంగాధర సురేందర్ తదితరులు ఉన్నారు.
ఇఫ్తార్‌కు నిధులు మంజూరు చేయండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళపల్లి, వీర్నపల్లి మండలాల్లో ఇఫ్తార్ విందులకు నిధులు మంజూరు చేయాలని మైనార్టీ నాయకులు కోరారు. ఈమేరకు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి భారతికి గురువారం వినతిపత్రం ఇచ్చారు. జిల్లా కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు ఎస్కే సాహెబ్, నాయకులు సయ్యద్ జహంగీర్, హైమద్, గౌస్, సర్దార్, హబీబ్, హమీద్ ఉన్నారు.
భక్తిశ్రద్ధలతో సంత్ సేవాలాల్ జాతర
రుద్రంగి(వేములవాడ): మండలంలోని బడితండాలో ఉగాది పండుగ సందర్భంగా శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్, జగదాంబదేవి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తండావాసులు జగదాంబదేవీకి, శ్రీసంత్ సేవలాల్ మహారాజ్‌కి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ జగదాంబదేవి, సంత్‌సేవాలాల్ మహారాజ్ జాతరను ఉగాది రోజున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతర మహోత్సవానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
కవి సమ్మేళనాలతో భాషాభివృద్ధి
ఇల్లంతకుంట(మానకొండూర్): భాషాభివృద్ధికి కవి సమ్మేళనాలు దోహదపడతాయని బాలసాహితీవేత్త డాక్టర్ వాసరవేణి పరుశరాములు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్‌లో గురువారం నవీన సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీపరాభవ నామ ఉగాది కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. జిల్లాలో 200 మంది పీహెచ్‌డీ పట్టాదారులు ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతంలో నవీన సాహితీ ప్రారంభించి, కవి సమ్మేళనాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. నవీన సాహితీ వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాజమౌళి, ఎస్సై సిరిసిల్ల అశోక్, ఉపసర్పంచ్ మూగు నాగరాజుశర్మ, వెంకటేశ్వరరావు, డాక్టర్ జగన్మోహనరావు, రణం మల్లేశం, కవులు బిల్ల సతీశ్‌కుమార్, రేగుల భిక్షపతి, ఎం.సుగుణ, గైని శ్రీనివాస్ గౌడ్, వొల్లాల మధుసూదన్ పాల్గొన్నారు.


