● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● అంగన్‌వాడీ భవనానికి భూమిపూజ
వేములవాడఅర్బన్: చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ మండలం శాభాష్‌పల్లిలో రూ.12 లక్షలతో నిర్మించే అంగన్‌వాడీ భవనానికి గురువారం భూమి పూజ చేశారు. అనంతరం ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరయ్యారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, పోషణరంగాల్లో నాణ్యత పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలన్నారు. సర్పంచ్ ఏటీ యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య, మాజీ సర్పంచ్ పండుగ ప్రవీణ్, గ్రామాధ్యక్షుడు స్వామి, కదిరె రాజుకుమార్, అభియాదవ్ పాల్గొన్నారు.


